ప్రపంచవ్యాప్తంగా ప్రతి 2 నిమిషాలకి ఒక రేప్ జరుగుతుంటే, భారతదేశంలో 16 నిమిషాలకి ఒక రేప్ జరుగుతూ రేప్ కాపిటల్‌గా పరిగణించబడుతున్నది. ఇంటి బయట ఒక అపరిచితుడు చేసే రేప్‌కి నేరస్థుడికి శిక్ష ఉంది. కానీ ఇంటిలోపల పెళ్లి, సంసారం, దాంపత్యం, భార్య విధి, భర్త హక్కు పేరిట భార్యల ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా ఎంత మంది భార్యలు, భర్తలతో లైంగిక అత్యాచారాలకు లేదా రేప్‌కి గురి అవుతున్నారో లెక్క లేదు. ప్రపంచంలో ఎన్నో దేశాలు మారిటల్ రేపి ని నేరం కింద పరిగణించినా భారతదేశంలో ఇంకా అటువంటి పరిస్థితి లేదు. దానికి కారణం లోతుగా పాతుకుపోయిన ఫ్యూడల్ వ్యవస్థ. దానితో ప్రభావితమైన న్యాయవ్యవస్థ. భారతదేశంలో మారిటల్ రేప్‌ని క్�... See more
ప్రపంచవ్యాప్తంగా ప్రతి 2 నిమిషాలకి ఒక రేప్ జరుగుతుంటే, భారతదేశంలో 16 నిమిషాలకి ఒక రేప్ జరుగుతూ రేప్ కాపిటల్‌గా పరిగణించబడుతున్నది. ఇంటి బయట ఒక అపరిచితుడు చేసే రేప్‌కి నేరస్థుడికి శిక్ష ఉంది. కానీ ఇంటిలోపల పెళ్లి, సంసారం, దాంపత్యం, భార్య విధి, భర్త హక్కు పేరిట భార్యల ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా ఎంత మంది భార్యలు, భర్తలతో లైంగిక అత్యాచారాలకు లేదా రేప్‌కి గురి అవుతున్నారో లెక్క లేదు. ప్రపంచంలో ఎన్నో దేశాలు మారిటల్ రేపి ని నేరం కింద పరిగణించినా భారతదేశంలో ఇంకా అటువంటి పరిస్థితి లేదు. దానికి కారణం లోతుగా పాతుకుపోయిన ఫ్యూడల్ వ్యవస్థ. దానితో ప్రభావితమైన న్యాయవ్యవస్థ. భారతదేశంలో మారిటల్ రేప్‌ని క్రిమినలైజ్ చేయాలా వద్దా అన్న చర్చ ఇంకా పరిశీలన స్థాయిలోనే ఉండడం చాలా సిగ్గుపడాల్సిన విషయం. గత 18 ఏళ్లుగా ఒక మారిటల్ & సైకోతెరపిస్టుగా ప్రాక్టీస్ చేస్తున్న నాకు వివాహం తరువాత భర్తల చేత లైంగిక అత్యాచారాలకు గురి అవుతున్న స్త్రీల బాధలు పూర్తిగా తెలుసు. భారత దేశంలో ప్రతీ భార్యా ఏదో ఒక రూపంలో రేప్ విక్టిమ్ కిందుకే వస్తుంది. ఇది ఎవరు కాదన్నా సూర్య చంద్రులంత వాస్తవం. ఈ నేపథ్యంలో రాసిన నవలే ఈ "విత్ యువర్ పర్మిషన్.” ఈ నవలలో ప్రతి స్త్రీ నా పేషంటే! వారి అనుమతితోనే పేర్లు ఊర్లు మార్చి ఒక సామాజిక ప్రయోజనాన్ని ఆశించి రాసాను. పురుషులు స్త్రీల పట్ల కావాలి, వారి హక్కుల పట్ల ఎడ్యుకేట్ కావాలి. భార్య సెక్స్‌కి 'నో' అంటే దాన్ని 'నో'గానే తీసుకోవాలి. ఆమె శరీరాన్ని, ఆమె హక్కుల్ని గౌరవించాలి. అదే ఈ పుస్తకం ఆశించే ప్రయోజనం. ఈ ఆశయంలో భాగంగానే గతంలో హస్బెండ్ స్టిచ్ 1&2 రెండు పుస్తకాలు వచ్చాయి. త్వరలో మూడోభాగం కూడ పాఠకులకు అందుబాటులోకి వస్తుంది.