నాకు జరిగిన విషయాలు, నేను చూసిన సంఘటనలే కాకుండా నేను విన్న, నాతో చెప్పుకున్న మనుషుల బాధలు కూడా ఇందులో కథలయ్యాయి. వాళ్ళందరూ ఇందులో పాత్రలయ్యారు. ఒక్కొక్క కథ రాస్తుంటే ఎప్పుడో పారేసుకోనొచ్చిన జీవితం కొంచెం కొంచెంగా దొరికినట్లనిపించింది. అంతలో కరోనా వల్ల నగరజీవితానికి తాత్కాలిక విరామం ఇవ్వాల్సి రావటంతో మా ఊరిలో ఉంటూ, ఇంట్లో వాళ్ళతో గడపటానికి ఎంతో సమయం దొరికింది. ఎన్నో కథలు తెలుసుకోవటానికి అవకాశం దొరికింది. వారమంతా పని చేసుకుంటూ, వారాంతాల్లో కథలు రాసి పత్రికలకి పంపేవాడిని. ఆలస్యమైనా రాసిన కథలన్నీ పత్రికల్లో వచ్చాయి. రాసుకుంటూ రాసుకుంటూ ఇన్ని కథలయ్యాయి. ఇందులో ఉన్న యాసంతా నేను వింటూ, మాట్... See more
నాకు జరిగిన విషయాలు, నేను చూసిన సంఘటనలే కాకుండా నేను విన్న, నాతో చెప్పుకున్న మనుషుల బాధలు కూడా ఇందులో కథలయ్యాయి. వాళ్ళందరూ ఇందులో పాత్రలయ్యారు. ఒక్కొక్క కథ రాస్తుంటే ఎప్పుడో పారేసుకోనొచ్చిన జీవితం కొంచెం కొంచెంగా దొరికినట్లనిపించింది. అంతలో కరోనా వల్ల నగరజీవితానికి తాత్కాలిక విరామం ఇవ్వాల్సి రావటంతో మా ఊరిలో ఉంటూ, ఇంట్లో వాళ్ళతో గడపటానికి ఎంతో సమయం దొరికింది. ఎన్నో కథలు తెలుసుకోవటానికి అవకాశం దొరికింది. వారమంతా పని చేసుకుంటూ, వారాంతాల్లో కథలు రాసి పత్రికలకి పంపేవాడిని. ఆలస్యమైనా రాసిన కథలన్నీ పత్రికల్లో వచ్చాయి. రాసుకుంటూ రాసుకుంటూ ఇన్ని కథలయ్యాయి. ఇందులో ఉన్న యాసంతా నేను వింటూ, మాట్లాడుతూ పెరిగిన యాస.
ఈ కథలన్నీ రాసుకున్నాక “వీటిలో మా యాసంతా భద్రంగా ఉంది కదా” అనే ఒక ఆలోచన చాలా హాయినిచ్చింది. ఇవన్నీ పుస్తకంగా వస్తూ ఉండటం ఇంకా ఎక్కువ హాయిగా, కొంత దిగులుగా (కారణం తెలియదు) ఉంది.
కథలన్నీ చేరాల్సిన చోటులకీ, చదవాల్సిన మనుషులకీ చేరతాయని ఆశిస్తూ....
- మొహమ్మద్ గౌస్.