మన దేశంలో సెక్స్ గురించి మాట్లాడటం తప్పు అనే అభిప్రాయం ఎక్కువగా ఉంటుంది. సెక్స్ గురించి మాట్లాడటం ఒక ముఖ్యమైన అంశంగా కూడా పరిగణించరు. సెక్స్ లేకపోతే అసలు మనమే లేము అనే ప్రాధమిక విషయాన్ని మనం మర్చిపోయాం. రాజారామమోహన రావు గారి లాంటి ప్రముఖ రచయిత తన నవల “శృంగార యాత్ర”లో మన దేశంలో గత అరవై మూడేళ్ల సుదీర్ఘ కాలంలో (1960 2023) జరిగిన శృంగార పరిణామాలను నవలీకరణ చేశారు. ఈ నవల కేవలం శృంగార కథ మాత్రమే కాదు. ఇది భారతీయ సమాజంలో లైంగికత పట్ల ఉన్న దృక్పథాలు, వాటిలో వచ్చిన మార్పులను సమగ్రంగా అధ్యయనం చేసిన ఒక సోషల్ డాక్యుమెంట్. 1960ల నాటి సమాజంలో లైంగికత పట్ల ఉన్న మూసపోత ఆలోచనలు, అజ్ఞానం గురించి చర్చిస్తుంది. ఆ తర్వాత �... See more
మన దేశంలో సెక్స్ గురించి మాట్లాడటం తప్పు అనే అభిప్రాయం ఎక్కువగా ఉంటుంది. సెక్స్ గురించి మాట్లాడటం ఒక ముఖ్యమైన అంశంగా కూడా పరిగణించరు. సెక్స్ లేకపోతే అసలు మనమే లేము అనే ప్రాధమిక విషయాన్ని మనం మర్చిపోయాం. రాజారామమోహన రావు గారి లాంటి ప్రముఖ రచయిత తన నవల “శృంగార యాత్ర”లో మన దేశంలో గత అరవై మూడేళ్ల సుదీర్ఘ కాలంలో (1960 2023) జరిగిన శృంగార పరిణామాలను నవలీకరణ చేశారు. ఈ నవల కేవలం శృంగార కథ మాత్రమే కాదు. ఇది భారతీయ సమాజంలో లైంగికత పట్ల ఉన్న దృక్పథాలు, వాటిలో వచ్చిన మార్పులను సమగ్రంగా అధ్యయనం చేసిన ఒక సోషల్ డాక్యుమెంట్. 1960ల నాటి సమాజంలో లైంగికత పట్ల ఉన్న మూసపోత ఆలోచనలు, అజ్ఞానం గురించి చర్చిస్తుంది. ఆ తర్వాత దశాబ్దాల్లో వచ్చిన సాంఘిక, సాంస్కృతిక మార్పులు, 80ల, 90ల నాటి టెలివిజన్ యుగం, తర్వాత వచ్చిన ఇంటర్నెట్ విప్లవం - ఇవన్నీ భారతీయుల లైంగిక జీవితాలను, ఆలోచనలను ఎలా ప్రభావితం చేశాయో కూడా ఈ నవల చర్చిస్తుంది. ముఖ్యంగా యువతరం మధ్య మారుతున్న లైంగిక ధోరణులు, వివాహేతర సంబంధాల పట్ల మారుతున్న దృక్పథాలకు అద్దం పడుతుంది.