ఈ కథలను వొట్టి కలల మేడలని కొట్టి పారేయడానికి లేదు. శ్రీశ్రీ, చలం, బుచ్చిబాబు అనే అరాచక సాహితీవేత్తలు ఈ కుర్రాడి యవ్వనాన్ని పరవళ్ళు తొక్కించారు. చివరికి ఈ ఇంగ్లీష్ మాస్టార్ని తెలుగు సాహిత్యం జయించింది. ఈ నాటకీయమైన కథలు చదివి తెలుసుకోవాలి. డ్రమెటిక్‌గా ఉన్నా ఒక లాజికల్ రియలిజం ఏదో శ్రీనాథ్ కథలను ముందుకు నడిపిస్తుంది. అసలు నాటకీయత లేనిదే కథలు పాఠకుల మనసుల్లో ముద్రలు వేయలేవు. కథ జీవితంలోని ద్రోహం, దౌర్జన్యం క్రూరమైన నేరాల డాక్యుమెంటరీ కాదు. అది అనుభూతికి ఆలోచనా వాహిక. చిరంతన దీప్తికీ, శాశ్వత కళాభినివేశానికి సంక్షిప్త వేదిక! ఇందులోని ఒక్కో కథా ఒక్కో రంగులో మన హృదయాన్ని తాకుతుంది. మానవత్వపు మం�... See more
ఈ కథలను వొట్టి కలల మేడలని కొట్టి పారేయడానికి లేదు. శ్రీశ్రీ, చలం, బుచ్చిబాబు అనే అరాచక సాహితీవేత్తలు ఈ కుర్రాడి యవ్వనాన్ని పరవళ్ళు తొక్కించారు. చివరికి ఈ ఇంగ్లీష్ మాస్టార్ని తెలుగు సాహిత్యం జయించింది. ఈ నాటకీయమైన కథలు చదివి తెలుసుకోవాలి. డ్రమెటిక్‌గా ఉన్నా ఒక లాజికల్ రియలిజం ఏదో శ్రీనాథ్ కథలను ముందుకు నడిపిస్తుంది. అసలు నాటకీయత లేనిదే కథలు పాఠకుల మనసుల్లో ముద్రలు వేయలేవు. కథ జీవితంలోని ద్రోహం, దౌర్జన్యం క్రూరమైన నేరాల డాక్యుమెంటరీ కాదు. అది అనుభూతికి ఆలోచనా వాహిక. చిరంతన దీప్తికీ, శాశ్వత కళాభినివేశానికి సంక్షిప్త వేదిక! ఇందులోని ఒక్కో కథా ఒక్కో రంగులో మన హృదయాన్ని తాకుతుంది. మానవత్వపు మంచి గంధమై మనసుని పరిమళ భరితం చేస్తుంది. తాడి ప్రకాష్ సీనియర్ జర్నలిస్ట్ శ్రీనాథ్ రెడ్డి స్వతహాగా కవి కూడా కావడం వలన కవిత్వంలో వలె వీరి కథల్లో పదునైన అభివ్యక్తి కనిపిస్తుంది. గాఢత, సాంద్రత చోటుచేసుకుంది. గ్రామీణ ప్రజల జీవనం నుండి ఎదిగిన రచయిత కావడంతో మనస్తత్వ వైచిత్రి నిండిన వాస్తవిక కథనం కనిపిస్తుంది. రచయిత కథా, కథనంలో, సంభాషణల్లో ప్రతి మాట ఆచితూచి వేస్తారు. సీరియస్ సన్నివేశం కూడా తనదైన హాస్య చతురతతో శ్రీనాథ్ రెడ్డి తన కథే తను రాస్తున్నట్టు, కాదు చెబుతున్నట్టే ఉండటం ఈ కథల ప్రత్యేకత. పల్లె ప్రజల భాషను, సంస్కృతిని, జీవన వైవిధ్యాన్ని చూపించడమే కాక అందంగా మలిచిన తీరు ఆకట్టుకొని మంచి కథలుగా నిలుస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈతకోట సుబ్బారావు సంపాదకులు, విశాలాక్షి సాహిత్య మాస పత్రిక