నవలలు కరువైన కాలం. సాహిత్యలోకం ఎడారిలా ఎండిపోతున్న రోజులు. అలాంటి సమయంలో ఒక చిన్న కథతో మొదలుపెట్టిన ప్రయాణం మూడేళ్లలో మూడు నవలలుగా విస్తరించాడు ప్రసాద్ సూరి. అతని కలం నుండి జాలువారిన ప్రతి అక్షరం ఒక సజీవ సాక్ష్యం. ఇప్పుడు మీ చేతిలో ఉన్న నవల "బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ఆర్ట్స్" ఉగాది నవలల పోటీకి వచ్చింది. కథ చదవడం మొదలు పెట్టాను. కల్పితమా? కాదు. ఆత్మకథా? అది కూడా కాదు. ఇది జ్వరపు కలల్లో కనిపించే నగ్న సత్యం. పుస్తకం తెరిచారంటే మూసేవరకు వదిలిపెట్టరు. ఎందుకంటే ఇది మీ కథ కూడా. మీ క్యాంపస్ నేల మీద పడ్డ మీ అడుగుల గుర్తులు, మీ క్లాస్ రూం బెంచీ మీద మీరు చెక్కిన పేర్లు, హాస్టల్ బాత్రూముల్లో గీసిన బొమ్మలు, అద్దె గదు�... See more
నవలలు కరువైన కాలం. సాహిత్యలోకం ఎడారిలా ఎండిపోతున్న రోజులు. అలాంటి సమయంలో ఒక చిన్న కథతో మొదలుపెట్టిన ప్రయాణం మూడేళ్లలో మూడు నవలలుగా విస్తరించాడు ప్రసాద్ సూరి. అతని కలం నుండి జాలువారిన ప్రతి అక్షరం ఒక సజీవ సాక్ష్యం. ఇప్పుడు మీ చేతిలో ఉన్న నవల "బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ఆర్ట్స్" ఉగాది నవలల పోటీకి వచ్చింది. కథ చదవడం మొదలు పెట్టాను. కల్పితమా? కాదు. ఆత్మకథా? అది కూడా కాదు. ఇది జ్వరపు కలల్లో కనిపించే నగ్న సత్యం. పుస్తకం తెరిచారంటే మూసేవరకు వదిలిపెట్టరు. ఎందుకంటే ఇది మీ కథ కూడా. మీ క్యాంపస్ నేల మీద పడ్డ మీ అడుగుల గుర్తులు, మీ క్లాస్ రూం బెంచీ మీద మీరు చెక్కిన పేర్లు, హాస్టల్ బాత్రూముల్లో గీసిన బొమ్మలు, అద్దె గదుల్లో రాత్రులు మేల్కొని కన్న కలలు - అన్నీ ఇందులో ఉన్నాయి. నాలుగేళ్ల కాలేజీ జీవితం. వందల సంఘటనలు. వేల అనుభూతులు. ప్రతి వాక్యం హృదయాన్ని చీల్చే బాణం. ప్రతి సన్నివేశం కళ్ళముందు కదిలే సినిమా. ప్రేమను గురించి రాసినప్పుడు కవిగా మారాడు. ఆరాధనను వర్ణించినప్పుడు భక్తుడయ్యాడు. చదివిన పుస్తకాల గురించి చెప్పినప్పుడు తత్వవేత్తగా మారాడు. ప్రతిసారీ ప్రసాద్ గానే మిగిలాడు. చెప్పాల్సింది నగ్నంగా చెప్పాడు. తాకాల్సింది సున్నితంగా తాకాడు. కాలేజీ జీవితాన్ని అక్షరాల అద్దంలో చూపించాడు. ఇప్పుడు మీ వంతు ఆ అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకుంటారా? లేక కళ్ళు మూసుకుంటారా? - మహి బెజవాడ