కళాకారులకు, ముఖ్యంగా రచయితలకు ప్రేమ ఎప్పటికీ అక్షయపాత్ర లాంటిది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన పుస్తకాలలో చాలావరకు ప్రేమ కథలే. 21 సంవత్సరాల భవ్య తెలుగు సాహిత్యంలో తన ప్రయాణాన్ని ఒక ప్రేమ కథతో ప్రారంభించింది. సంక్లిష్టమైన కథనంతో, కథలో మరో కథని అల్లుతూ చేసిన నిర్మాణం ఆకట్టుకుంటుంది. మన స్వంత ప్రేమ విషయంలో మనం గుడ్డివాళ్లం. కానీ ఇతరుల ప్రేమ కథల ద్వారానే మనం ప్రేమ గురించి తెలుసుకుంటాం. అలాంటి రెండు ప్రేమకథలను ఈ నవల ద్వారా భవ్య మన ముందుంచింది. అయినా పాఠకులను ఎక్కడా గందరగోళపరచకుండా కథను నడిపించగలిగిన నైపుణ్యం ఆశ్చర్యపరుస్తుంది. ప్రేమ కేవలం వ్యక్తుల మధ్యే కాదు, కాలాలు, దూరాల మధ్య �... See more
కళాకారులకు, ముఖ్యంగా రచయితలకు ప్రేమ ఎప్పటికీ అక్షయపాత్ర లాంటిది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన పుస్తకాలలో చాలావరకు ప్రేమ కథలే. 21 సంవత్సరాల భవ్య తెలుగు సాహిత్యంలో తన ప్రయాణాన్ని ఒక ప్రేమ కథతో ప్రారంభించింది. సంక్లిష్టమైన కథనంతో, కథలో మరో కథని అల్లుతూ చేసిన నిర్మాణం ఆకట్టుకుంటుంది. మన స్వంత ప్రేమ విషయంలో మనం గుడ్డివాళ్లం. కానీ ఇతరుల ప్రేమ కథల ద్వారానే మనం ప్రేమ గురించి తెలుసుకుంటాం. అలాంటి రెండు ప్రేమకథలను ఈ నవల ద్వారా భవ్య మన ముందుంచింది. అయినా పాఠకులను ఎక్కడా గందరగోళపరచకుండా కథను నడిపించగలిగిన నైపుణ్యం ఆశ్చర్యపరుస్తుంది. ప్రేమ కేవలం వ్యక్తుల మధ్యే కాదు, కాలాలు, దూరాల మధ్య కూడా సేతువుగా మారగలదని నిరూపించే ప్రయత్నం ఈ “దట్ లాస్ట్ మెలడీ”. తెలుగు సాహిత్యంలో కొత్త ఊపిరిని నింపే ఈ నవలను చదవడం మిస్ కాకండి!