అంతా దేవుడి దయ. అంతా ఆయనే. అన్నీ ఆయన చేస్తున్నవే అనుకోవడం ఆస్తికత్వం ఇదంతా నా కష్టార్జితం. నా స్వయంకృషి. నా ఆలోచనల ప్రతిఫలం అనుకోవడం నాస్తికత్వం. ఈ రెండు భావాలు కాడికి కట్టిన రెండు ఎద్దుల్లాంటివి! నా పద్ధతి నాదే అని ఆస్తికత్వం అటు లాక్కెళ్ళినా, కాదు. .. నా పద్ధతి నాదే అని నాస్తికత్వం ఇటు లాక్కెళ్ళినా సరైనటువంటి ఫలాలను మనం అందుకోలేకపోతాం! అటు చేస్తున్న పని శ్రద్ధగా, అంకితభావంతో, నవ్యతతో చేయాలి... ఇటు స్వామి అనుగ్రహం తోడవ్వాలి... ఈ రెండూ కలిస్తేనే జీవితమనే బండి సక్రమంగా సాగుతుందని నా విశ్వాసం. భగవద్గీత చెప్పినా, మహ్మద్ ప్రవక్త చెప్పినా, జైనులు చెప్పినా, బౌద్ధులు చెప్పినా ఒకటే చెప్పారు. "కష్టపడు ... ఫ�... See more
అంతా దేవుడి దయ. అంతా ఆయనే. అన్నీ ఆయన చేస్తున్నవే అనుకోవడం ఆస్తికత్వం ఇదంతా నా కష్టార్జితం. నా స్వయంకృషి. నా ఆలోచనల ప్రతిఫలం అనుకోవడం నాస్తికత్వం. ఈ రెండు భావాలు కాడికి కట్టిన రెండు ఎద్దుల్లాంటివి! నా పద్ధతి నాదే అని ఆస్తికత్వం అటు లాక్కెళ్ళినా, కాదు. .. నా పద్ధతి నాదే అని నాస్తికత్వం ఇటు లాక్కెళ్ళినా సరైనటువంటి ఫలాలను మనం అందుకోలేకపోతాం! అటు చేస్తున్న పని శ్రద్ధగా, అంకితభావంతో, నవ్యతతో చేయాలి... ఇటు స్వామి అనుగ్రహం తోడవ్వాలి... ఈ రెండూ కలిస్తేనే జీవితమనే బండి సక్రమంగా సాగుతుందని నా విశ్వాసం. భగవద్గీత చెప్పినా, మహ్మద్ ప్రవక్త చెప్పినా, జైనులు చెప్పినా, బౌద్ధులు చెప్పినా ఒకటే చెప్పారు. "కష్టపడు ... ఫలితాన్ని ఆశించకు" అని. నీ కష్టం నువ్వు పడితే ఆ భగవంతుడే దానికి సంబంధించిన ఫలితాన్ని ఇస్తాడని తెలియ జేయడానికే నా ఈ పుస్తక రచన. అంతేగాని... నాకున్న కష్టాల్ని, నేను పడినటువంటి బాధల్నీ చెప్పుకుని నేను ఇంత తక్కువ వాడిననీ, బీదవాడిననీ, ఇంత దారుణమైన స్థితి నుంచి వచ్చాననీ మీ దగ్గర నుంచి జాలి పొందడానికి గానీ... లేదా నేను సాధించిన విజయాల్ని... నేను సాధించిన విజయసోపానాల్ని మీ ముందుంచి నేనింత గొప్పవాడిననీ చెప్పుకోవడానికి ఈ పుస్తకం రాయడం లేదు. -- బ్రహ్మానందం