సినిమాల్లో కి వద్దామని అనుకున్నప్పుడు- మొట్టమొదట ఫిల్మ్ మేకింగ్ గురించి కొన్ని పుస్తకాలు (సిడ్ ఫీల్డ్, రాబర్ట్ మెకీ ఇంకా చాలా) కొన్నాను. చాలా సార్లు ఆ పుస్తకాలు ఎంత బోరింగ్ గా ఉంటాయంటే, ఏంట్రా బాబూ ఈ సోది అనిపించేది. అలాగే కథలు రాయడం నేర్చుకోవాలని కాదు గానీ,ఎలా రాసారో చూద్దామని అయాన్ ర్యాండ్ – ఆర్ట్ ఆఫ్ ఫిక్షన్ లాంటి పుస్తకాలు కొని ఎన్నేళ్ళైనా ఇప్పటికీ పూర్తి చేయలేదు. చెప్పొచ్చేదేమిటంటే – క్రియేటివ్ ప్రాసెస్ కి సెల్ఫ్ హెల్ప్ బుక్స్ ఎంత వరకూ ఉపయోగపడతాయనేది నాకు పెద్ద అనుమానం. అదే సమయంలో సిడ్నీ లూమెట్ – మేకింగ్ మూవీస్ పుస్తకం కొన్నాను. అది కూడా పైన చెప్పిన పుస్తకాల్లాగే పరమ బోరింగ్ గా ఉంటుం�... See more
సినిమాల్లో కి వద్దామని అనుకున్నప్పుడు- మొట్టమొదట ఫిల్మ్ మేకింగ్ గురించి కొన్ని పుస్తకాలు (సిడ్ ఫీల్డ్, రాబర్ట్ మెకీ ఇంకా చాలా) కొన్నాను. చాలా సార్లు ఆ పుస్తకాలు ఎంత బోరింగ్ గా ఉంటాయంటే, ఏంట్రా బాబూ ఈ సోది అనిపించేది. అలాగే కథలు రాయడం నేర్చుకోవాలని కాదు గానీ,ఎలా రాసారో చూద్దామని అయాన్ ర్యాండ్ – ఆర్ట్ ఆఫ్ ఫిక్షన్ లాంటి పుస్తకాలు కొని ఎన్నేళ్ళైనా ఇప్పటికీ పూర్తి చేయలేదు. చెప్పొచ్చేదేమిటంటే – క్రియేటివ్ ప్రాసెస్ కి సెల్ఫ్ హెల్ప్ బుక్స్ ఎంత వరకూ ఉపయోగపడతాయనేది నాకు పెద్ద అనుమానం. అదే సమయంలో సిడ్నీ లూమెట్ – మేకింగ్ మూవీస్ పుస్తకం కొన్నాను. అది కూడా పైన చెప్పిన పుస్తకాల్లాగే పరమ బోరింగ్ గా ఉంటుందేమోనని భయపడుతూనే మొదలుపెట్టి ఒక రాత్రి పూర్తిగా చదివేశాను. సరిగ్గా అలాగే జరిగింది ఖదీర్ బాబు పుస్తకం విషయం లో కూడా. ఈ రెండు పుస్తకాలకీ ఉన్న పోలిక ఏంటంటే – వీళ్లిద్దరూ కూడా వారి వారి రంగాల్లో ఎంతో సాధించిన తర్వాత, వారి అనుభవాలను చాలా ఇన్ఫార్మల్ వాయిస్ లో, ఎంతో ఆత్మీయంగా మనతో పంచుకుంటారు. అలాగే రెండు పుస్తకాల్లోనూ అథారిటేటివ్ వాయిస్ ఉండదు. టోన్ చాలా మోడెస్ట్ గా ఉంటుంది. మేము చెప్పిందే రైట్ అని తలబిరుపూ ఉండదు. అందుకే ఈ రెండు పుస్తకాలు చదువుతుంటే మనకి ఆప్తులైన వారితో మాట్లాడినట్టనిపిస్తుంది.