1980, 90లలో ఎన్నో తెలుగు నవలలు సినిమాలుగా వచ్చాయి. గత పాతికేళ్లలో అలాంటి ప్రయత్నాలు దాదాపుగా జరగలేదనే చెప్పాలి. అందుకు ప్రధాన కారణం తెలుగులో నవలలు రాసే రచయితలు పూర్తిగా తగ్గిపోవడం. కానీ మేము నిర్వహించిన ఉగాది నవలల పోటీ ద్వారా మళ్లీ అలాంటి ప్రయత్నాలు జరగాలని మేము ఆశించాం. ఆ ఆశ “ఎవరు" లాంటి నవలతో తీరుతుందనే నమ్మకం ఉంది. తెలుగులో క్రైం నవలలు పూర్తిగా అంతరించిపోయిన ఈ సమయంలో మర్డర్ మిస్టరీ ప్రధానంగా సాగుతూ, ఊహకందని ట్విస్ట్‌లతో నడుస్తూ, ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, దీప్ ఫేక్ లాంటి టెక్నాలజీలు కథనంలో వాడుతూ వచ్చిన ఆసక్తికరమైన నవల “ఎవరు.” ఒక విహారయాత్రకు వెళ్లి, గుర్తుగా �... See more
1980, 90లలో ఎన్నో తెలుగు నవలలు సినిమాలుగా వచ్చాయి. గత పాతికేళ్లలో అలాంటి ప్రయత్నాలు దాదాపుగా జరగలేదనే చెప్పాలి. అందుకు ప్రధాన కారణం తెలుగులో నవలలు రాసే రచయితలు పూర్తిగా తగ్గిపోవడం. కానీ మేము నిర్వహించిన ఉగాది నవలల పోటీ ద్వారా మళ్లీ అలాంటి ప్రయత్నాలు జరగాలని మేము ఆశించాం. ఆ ఆశ “ఎవరు" లాంటి నవలతో తీరుతుందనే నమ్మకం ఉంది. తెలుగులో క్రైం నవలలు పూర్తిగా అంతరించిపోయిన ఈ సమయంలో మర్డర్ మిస్టరీ ప్రధానంగా సాగుతూ, ఊహకందని ట్విస్ట్‌లతో నడుస్తూ, ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, దీప్ ఫేక్ లాంటి టెక్నాలజీలు కథనంలో వాడుతూ వచ్చిన ఆసక్తికరమైన నవల “ఎవరు.” ఒక విహారయాత్రకు వెళ్లి, గుర్తుగా అక్కడ ఫోటో తీసుకున్న ఆరుగురు స్నేహితులు, ఆ ఫోటోలో వాళ్లు నిల్చున్న వరుసలో ఒక్కొక్కరిగా చనిపోతుంటారు. వీళ్ల మరణానికి కారణం ఎవరు? బ్లాక్ బస్టర్ సినిమాకో, సీరీస్్క కావాల్సిన కథనంతో, మొదలుపెడితే చివరి పేజీ వరకూ ఆపకుండా చదివించే పేజ్ టర్నర్ ఈ నవల. మనం ఒకటనుకుంటే మరొకటి జరుగుతుంది. ఇంతటితో కథంతా ఒక కొలిక్కి వచ్చేసిందని ఊపిరి పీల్చుకునేలోగా మరొక కొత్త ట్విస్ట్‌లో సాగే సస్పెన్స్ థ్రిల్లర్, క్రైం నవలలు ఇష్టపడే ఎవరికైనా తప్పక నచ్చుతుంది.