తెలుగు సాహిత్యం ఒక పెద్ద నది. పురాతనమైనది. శక్తివంతమైనది. కథలు, కవితలు, నవలలు - ఇవి దాని ప్రధాన ప్రవాహాలు. కానీ ఉపనదులు కూడా ఉన్నాయి. ఫ్లాష్ ఫిక్షన్. పిట్టకథలు. గొలుసు కథలు, ఇంకా ఎన్నో. ఇవి చిన్నవి, కానీ ప్రభావవంతమైనవి. గత పాతికేళ్ళగా ఈ ఉపనదులు మందగించాయి. ఇప్పుడు మళ్లీ వేగం పుంజుకుంటున్నాయి. హరీష్ మీనన్ ట్విట్టర్లో పాత ప్రవాహాన్ని పునరుజ్జీవింపజేశాడు. అతని (ఫ్లాష్ ఫిక్షన్) కథలు కొన్ని చిన్నవి, బలమైనవి. మరికొన్ని (గొలుసు కథలు) పెద్దవి, ప్రవాహంలా వేగంగా సాగేవి. ట్విట్టర్లో వేలమంది ఈ కథలను ఆదరించారు. 'పులస' పుస్తకం ద్వారా హరీష్ మీనన్ అనే కొత్త రచయితను తెలుగు సాహితీలోకానికి పరిచయం చేస్తున్నాం. ఆన్�... See more
తెలుగు సాహిత్యం ఒక పెద్ద నది. పురాతనమైనది. శక్తివంతమైనది. కథలు, కవితలు, నవలలు - ఇవి దాని ప్రధాన ప్రవాహాలు. కానీ ఉపనదులు కూడా ఉన్నాయి. ఫ్లాష్ ఫిక్షన్. పిట్టకథలు. గొలుసు కథలు, ఇంకా ఎన్నో. ఇవి చిన్నవి, కానీ ప్రభావవంతమైనవి. గత పాతికేళ్ళగా ఈ ఉపనదులు మందగించాయి. ఇప్పుడు మళ్లీ వేగం పుంజుకుంటున్నాయి. హరీష్ మీనన్ ట్విట్టర్లో పాత ప్రవాహాన్ని పునరుజ్జీవింపజేశాడు. అతని (ఫ్లాష్ ఫిక్షన్) కథలు కొన్ని చిన్నవి, బలమైనవి. మరికొన్ని (గొలుసు కథలు) పెద్దవి, ప్రవాహంలా వేగంగా సాగేవి. ట్విట్టర్లో వేలమంది ఈ కథలను ఆదరించారు. 'పులస' పుస్తకం ద్వారా హరీష్ మీనన్ అనే కొత్త రచయితను తెలుగు సాహితీలోకానికి పరిచయం చేస్తున్నాం. ఆన్వీక్షికి సంస్థ కొత్త రచయితలకు అండగా నిలబడడమే కాదు, మరుగున పడ్డ సాహిత్య ప్రక్రియలకు వేదిక కూడా. తెలుగు సాహిత్య నదిలో పాత ఉపనదులు మళ్లీ ఉవ్వెత్తున ప్రవహిస్తున్నాయి. చిన్నవే, కానీ శక్తివంతమైనవి. తెలుగు సాహిత్యం కొత్త ఊపును సంతరించుకుంటోంది. ఇది శుభపరిణామం.