ఈ తరం యువతీయువకులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. పెళ్లి విషయంలో ఆడదాని అందచందాలను గానీ, మొగవాడి ధనాన్ని గానీ ప్రధాన ప్రమాణాలుగా పరిగణించకూడదు. ఎందుకంటే, ఈ రెండూ చాలా అశాశ్వతమైనవి. అవసరానికి మించిన సంపద అనర్థాలకే దారితీస్తుందని మనం గుర్తుంచుకోవాలి. డబ్బు ఎంత ఎక్కువగా వచ్చినా, దానితో తృప్తి చెందకపోవడం ఆందోళనకరమైన విషయం. యువతరం అలవరచుకోవాల్సిన అత్యంత కీలకమైన సుగుణాలలో తృప్తి ఒకటి. తమకు లభించే ఆదాయంతో తృప్తిగా జీవించగల దంపతులు ఎప్పటికీ విడిపోరు. ఇంజనీరింగ్ కాలేజ్లో కలిసి చదువుకున్న నలుగురు అమ్మాయిల జీవితాలను కథనం చేసిన నవల ఇది. కాలేజ్ తర్వాత అందరూ ఒక్కోదారిలో వెళ్లిపోయినా తమ జీవి... See more
ఈ తరం యువతీయువకులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. పెళ్లి విషయంలో ఆడదాని అందచందాలను గానీ, మొగవాడి ధనాన్ని గానీ ప్రధాన ప్రమాణాలుగా పరిగణించకూడదు. ఎందుకంటే, ఈ రెండూ చాలా అశాశ్వతమైనవి. అవసరానికి మించిన సంపద అనర్థాలకే దారితీస్తుందని మనం గుర్తుంచుకోవాలి. డబ్బు ఎంత ఎక్కువగా వచ్చినా, దానితో తృప్తి చెందకపోవడం ఆందోళనకరమైన విషయం. యువతరం అలవరచుకోవాల్సిన అత్యంత కీలకమైన సుగుణాలలో తృప్తి ఒకటి. తమకు లభించే ఆదాయంతో తృప్తిగా జీవించగల దంపతులు ఎప్పటికీ విడిపోరు. ఇంజనీరింగ్ కాలేజ్లో కలిసి చదువుకున్న నలుగురు అమ్మాయిల జీవితాలను కథనం చేసిన నవల ఇది. కాలేజ్ తర్వాత అందరూ ఒక్కోదారిలో వెళ్లిపోయినా తమ జీవితాల్లో జరుగుతున్న విషయాలను ఎప్పటికప్పుడు ఒకరితో ఒకరు చర్చించుకుంటూ తమలో ఒకరికి సమస్య వచ్చినప్పుడు వారికి అండగా నిలబడి స్నేహానికి ఉన్న విలువలను తెలియచేసిన నవల. అలాగే డబ్బు, అందం శాశ్వతం కాదుబీ ఒకరికోసం మరొకరు తోడుగా నిలబడడంలోనే నిజమైన ఆనందం ఉందని చెప్పే సందేశాత్మక నవల 'పెళ్లి పుస్తకం. '