మనం ఎన్నో సీరియల్ కిల్లర్ కథలు, సినిమాలు, సీరీస్లు చూసుంటాం. కొన్ని బావుంటాయి. కొన్ని బోర్ కొడ్తాయి. కానీ ఈ కథలన్నింటిలోనూ ఎంతో కొంత ఆసక్తి కలిగించే అంశం మాత్రం అసలు సీరియల్ కిల్లర్ ఎందుకు హత్యలు - చేస్తున్నాడు అనే విషయం. అలాగే సీరియల్ కిల్లర్ మోడస్ ఆపరాండీ కూడా ఒక్కోసారి ఆసక్తి కరంగా ఉంటుంది. ఈ విషయాల్లో “బుట్ట బొమ్మ” నవల చాలా ప్రత్యేకం. తెలుగులోనే కాదు, మిగతా భాషల్లో కూడా ఇలాంటి ఒక యూనిక్ పాయింట్ నవల రాలేదనే చెప్పొచ్చు. మనుషులు మధ్య దూరం పెరిగి, మనుషులు సాటి మనుషులతో కంటే మొబైల్ ఫోన్స్, మెషీన్స్ తో దగ్గరవుతున్న క్రమం మన కళ్లముందే జరిగిపోతోంది. మారుతున్న ఈ విషయాలన్నింటినీ ఒక థ్రిల్లింగ్ సీ�... See more
మనం ఎన్నో సీరియల్ కిల్లర్ కథలు, సినిమాలు, సీరీస్లు చూసుంటాం. కొన్ని బావుంటాయి. కొన్ని బోర్ కొడ్తాయి. కానీ ఈ కథలన్నింటిలోనూ ఎంతో కొంత ఆసక్తి కలిగించే అంశం మాత్రం అసలు సీరియల్ కిల్లర్ ఎందుకు హత్యలు - చేస్తున్నాడు అనే విషయం. అలాగే సీరియల్ కిల్లర్ మోడస్ ఆపరాండీ కూడా ఒక్కోసారి ఆసక్తి కరంగా ఉంటుంది. ఈ విషయాల్లో “బుట్ట బొమ్మ” నవల చాలా ప్రత్యేకం. తెలుగులోనే కాదు, మిగతా భాషల్లో కూడా ఇలాంటి ఒక యూనిక్ పాయింట్ నవల రాలేదనే చెప్పొచ్చు. మనుషులు మధ్య దూరం పెరిగి, మనుషులు సాటి మనుషులతో కంటే మొబైల్ ఫోన్స్, మెషీన్స్ తో దగ్గరవుతున్న క్రమం మన కళ్లముందే జరిగిపోతోంది. మారుతున్న ఈ విషయాలన్నింటినీ ఒక థ్రిల్లింగ్ సీరియల్ కిల్లర్ కథ ద్వారా చెప్పడం ఈ నవల ప్రత్యేకత. అంతేకాదు, ఈ నవలలోని కథాంశం చాలా వరకూ కల్పితం కాదు. ప్రపంచంలో వివిధ మూలల్లో జరిగిన నిజ జీవిత సంఘటనలు ఆధారం చేసుకుని వచ్చిన ఈ నవల తెలుగు క్రైమ్ ఫిక్షన్ విభాగంలో వచ్చిన మంచి నవలలో ఒకటిగా చేర్చవచ్చు.