ఇంతకీ ఆడవాళ్ళు కలిసినప్పుడు ఏం మాట్లాడుకుంటారు? అనే కుతుహాలం చాలా మందికి ఉంటుంది. అయితే, వాళ్ళ మాటల్లో ఏం దొర్లుతాయో ఎవరికీ తెలీదు. వాళ్ళ బాధలు, సమస్యలు ఈ సమాజం పురుషాధిక్య సమాజం కనుక పట్టించుకోలేదు. ఈ కథలు మనం అనుకునే విమెన్ టాక్స్. unfiltered విమెన్ టాక్స్. ఇవి చదివి తట్టుకోవడం అయ్యే పనేనా? నలుగురు పురుషులు జమగూడినప్పుడు ఇలానే మాట్లాడుకుంటారు. కొన్నిసార్లు అది రాతలోనూ వ్యక్తమైంది. ఆ ప్రివిలేజ్ పురుషులకున్నది. అయితే, ఇక్కడ act of loveకి తెలుగు సమానార్థకం బూతే. ఒకరిని తిట్టాలన్నా? గోప్యాంగాల పేర్లతోనో, act of love తోనో తిడతారు. ప్రేమ వ్యక్తీకరణ తిట్టు ఎందుకయ్యిందో తెలీదు. ఆకలి రాజ్యం సినిమాలో కమల్ హసన్ వాళ్ళ న�... See more
ఇంతకీ ఆడవాళ్ళు కలిసినప్పుడు ఏం మాట్లాడుకుంటారు? అనే కుతుహాలం చాలా మందికి ఉంటుంది. అయితే, వాళ్ళ మాటల్లో ఏం దొర్లుతాయో ఎవరికీ తెలీదు. వాళ్ళ బాధలు, సమస్యలు ఈ సమాజం పురుషాధిక్య సమాజం కనుక పట్టించుకోలేదు. ఈ కథలు మనం అనుకునే విమెన్ టాక్స్. unfiltered విమెన్ టాక్స్. ఇవి చదివి తట్టుకోవడం అయ్యే పనేనా? నలుగురు పురుషులు జమగూడినప్పుడు ఇలానే మాట్లాడుకుంటారు. కొన్నిసార్లు అది రాతలోనూ వ్యక్తమైంది. ఆ ప్రివిలేజ్ పురుషులకున్నది. అయితే, ఇక్కడ act of loveకి తెలుగు సమానార్థకం బూతే. ఒకరిని తిట్టాలన్నా? గోప్యాంగాల పేర్లతోనో, act of love తోనో తిడతారు. ప్రేమ వ్యక్తీకరణ తిట్టు ఎందుకయ్యిందో తెలీదు. ఆకలి రాజ్యం సినిమాలో కమల్ హసన్ వాళ్ళ నాన్నతో చేసే సంభాషణలో అంటాడు కదా... "ఇక్కడుంటే జుట్టంటారు, ఇక్కడుంటే కనుబొమ్మలు, ఇది మీసం, ఇది గడ్డం. శరీరంలో ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క పేరుదానికి. మొత్తం వెయ్యి పేర్లు. పరమాత్ముడిలా." ఆ పరమాత్ముడి పేరు ఉచ్చరించనీయని దైవ భాషలో ఉండేవే ఈ "దేవ రహస్యాలు". Have some guts to read. - అరుణాంక్ లత