ఎలాంటి పుస్తకమైనా మన ఆలోచనా తీరుని పదునుపెట్టాలి, ముందుకు నడపాలి. అలాంటి సాహిత్యం మనని మనం బెటర్ ఇండివిడ్యువల్‌గా మార్చుకోడానికి సహాయపడుతుంది. చిక్ లిట్ అచ్చం అలాంటి రచనే. మొదటి పేజీ మొదలు పెట్టినప్పటినుండి ఆఖరి పేజీ పూర్తయ్యేలోపు మనని మనం వెతికి, తట్టి, ప్రశ్నించుకుంటాం. మనకి మనమే కొత్తగా దొరుకుతాం. రోజు చూసే సంఘటనలు, చూసి చూడనట్టు వదిలేసిన విషయాలు మన కళ్లముందుకొచ్చి నిల్చుంటాయి. పట్టించుకోలేదేంటని నిలదీస్తాయి. ఇదొక థ్రిలర్, ఇదొక లవ్ స్టోరీ, ఇదొక సోషల్ డాక్యుమెంటరీ. ఇది టోటల్‌గా ఒక కంటెంపరరీ నవల. ఆ తరానిది, ఈ తరానిది. తరాల మధ్యన వంతెన.