కొన్ని మనం గుర్తుపెట్టుకోవాలనుకొని గుర్తుపెట్టుకున్న కథలు, కొన్ని గుర్తుపెట్టుకోవాలని అనుకొని కూడా తెలియకుండా మర్చిపొయే కథలు. గుర్తుండిపోయేవి, అప్పుడప్పుడూ గుర్తొచ్చేవి, వదిలించుకున్నవి, వదల్లేనివి, నీవి, నావి, మనందరివీ ఈ కథలు. ఓ కథలో ఏ విషయాన్ని అస్సలు పట్టించుకోకుండా వదిలేస్తామో, అదే విషయం ఇంకో కథ రూపాన వచ్చి తెగ హింస పెడుతుంది. నిన్నటి కథలో బాగా నచ్చిన ఏదో సంగతి ఈ రోజుకి రోత పుట్టిస్తుంది. ఈ రోజు అంత అసహ్యం కలిగించిన అదే సంగతి రేపటికి బతకడానికి ఆశని కలిగిస్తుంది. అవన్ని పోగేసి మూట కట్టి కథల్లా మీ చెతికిచ్చాను.