ఈ పుస్తకం గుడిపాటి వెంకటచలంగారి మీద చేసిన పరిశోధన. ఆయన వ్యక్తిత్వాన్ని, సాహిత్యాన్ని కలుపుకుంటూ ఒకఅన్వేషిగా 85ఏళ్లు ఆయన చేసిన ప్రయాణసారాన్ని సహేతుకంగా వివరించిన పుస్తకం. ఆ విధంగా ఇది చలంగారి అన్వేషణను చెప్పే పరిశోధన. విశ్వవిద్యాలయాల పరిధిలో చలం మొత్తాన్ని ఒక అంశంగా తీసుకుని సత్యాన్వేషిగా ఆయనను నిరూపించిన సమగ్ర పరిశోధన ఇప్పటికి ఇదే. ఈ పరిశోధనకు వాడ్రేవు వీరలక్ష్మీ దేవికి ఆంధ్రవిశ్వవిద్యాలయం స్వర్ణపతకాన్ని బహూకరించింది చలంగారి గురించి ఆయన సాహిత్యం గురించీ కూడా ఇప్పటికీ ఎందరో సాహిత్య పాఠకులకు కూడా సదవగాహన లేదు. ఉన్నవారు కూడా ఆయనను రెండు భాగాలుగా విడదీసి కొందరు మొదటి భాగాన్ని, మరికొం... See more
ఈ పుస్తకం గుడిపాటి వెంకటచలంగారి మీద చేసిన పరిశోధన. ఆయన వ్యక్తిత్వాన్ని, సాహిత్యాన్ని కలుపుకుంటూ ఒకఅన్వేషిగా 85ఏళ్లు ఆయన చేసిన ప్రయాణసారాన్ని సహేతుకంగా వివరించిన పుస్తకం. ఆ విధంగా ఇది చలంగారి అన్వేషణను చెప్పే పరిశోధన. విశ్వవిద్యాలయాల పరిధిలో చలం మొత్తాన్ని ఒక అంశంగా తీసుకుని సత్యాన్వేషిగా ఆయనను నిరూపించిన సమగ్ర పరిశోధన ఇప్పటికి ఇదే. ఈ పరిశోధనకు వాడ్రేవు వీరలక్ష్మీ దేవికి ఆంధ్రవిశ్వవిద్యాలయం స్వర్ణపతకాన్ని బహూకరించింది చలంగారి గురించి ఆయన సాహిత్యం గురించీ కూడా ఇప్పటికీ ఎందరో సాహిత్య పాఠకులకు కూడా సదవగాహన లేదు. ఉన్నవారు కూడా ఆయనను రెండు భాగాలుగా విడదీసి కొందరు మొదటి భాగాన్ని, మరికొందరు రెండవ భాగాన్ని తప్పుపడతారు. ఆంధ్రదేశపు చలమూ, అరుణాచలం చలమూ కూడా ఏకమార్గ పధికుడే అని నిరూపించడం ఈ పుస్తకం యొక్క లక్ష్యం . మొదటి నుంచీ ఆయనను ఒక అన్వేషణ నడిపించుకుంటూ వెళ్లిందనీ, అది సత్యానికి చెందిన అన్వేషణ అనీ ఈ పరిశోధన నిరూపిస్తుంది. అదే ఆయనను అరుణాచలం వేపు తిప్పింది.ఆ పరిణామక్రమమంతటినీ ఆయన పలు రచనల ఆధారంగా ఈ పుస్తకం నమోదు చేసింది. సాహిత్యవేత్తల ప్రశంసలు అందుకున్న ఈ రచన, సాహిత్య పాఠకులకు కూడా చలాన్ని సరిఅయిన రీతిలో పరిచయం చేసిందని పలువురు తెలియజేశారు. సత్యాన్వేషి అయిన చలం రచనలు మరో వందేళ్ల తర్వాత కూడా సమాజానికి తప్పనిసరి అవసరం.