తాత్వికత ఎవరికి అవసరం? తాత్వికత అవసరంలేని మనిషి ఉంటాడా? ఉంటే అతని జీవితం ఎలా ఉంటుంది? ప్రసిద్ధ తాత్వికోక్తుల్ని మనుషులు తెలియకుండానే ఎలా వాడుకుంటున్నారు? అందువల్ల ఏం జరుగుతోంది? సరిగా జీవించదలుచుకున్న మనిషి ఫిలసాఫికల్ డిటెక్షన్ ని ఎందుకు, ఎలా నిర్వహించాలి? విది(డ్యూటీ)కీ బాధ్యత (అబ్లిగేషన్)కీ తేడా ఉందా? ఉంటే ఏమిటి? మనిషి దేన్ని అనుసరించాలి? మనిషి నైతికత అనేది దేన్నిబట్టి నిర్ధారణ అవుతుంది? అది ఎన్ని రంగాలకు విస్తరించి ఉంటుంది ? మీరు ప్రత్యక్ష జ్ఞాన స్థాయిలో ఉండిపోయారా? భావన రూపకర్త స్థాయిలో జీవిస్తున్నారా? విశ్వాసం, బలప్రయోగం ఆధార బిందువులుగా ఈ రోజున ప్రపంచాన్ని నడిపిస్తున్న రెండు తాత్�... See more
తాత్వికత ఎవరికి అవసరం? తాత్వికత అవసరంలేని మనిషి ఉంటాడా? ఉంటే అతని జీవితం ఎలా ఉంటుంది? ప్రసిద్ధ తాత్వికోక్తుల్ని మనుషులు తెలియకుండానే ఎలా వాడుకుంటున్నారు? అందువల్ల ఏం జరుగుతోంది? సరిగా జీవించదలుచుకున్న మనిషి ఫిలసాఫికల్ డిటెక్షన్ ని ఎందుకు, ఎలా నిర్వహించాలి? విది(డ్యూటీ)కీ బాధ్యత (అబ్లిగేషన్)కీ తేడా ఉందా? ఉంటే ఏమిటి? మనిషి దేన్ని అనుసరించాలి? మనిషి నైతికత అనేది దేన్నిబట్టి నిర్ధారణ అవుతుంది? అది ఎన్ని రంగాలకు విస్తరించి ఉంటుంది ? మీరు ప్రత్యక్ష జ్ఞాన స్థాయిలో ఉండిపోయారా? భావన రూపకర్త స్థాయిలో జీవిస్తున్నారా? విశ్వాసం, బలప్రయోగం ఆధార బిందువులుగా ఈ రోజున ప్రపంచాన్ని నడిపిస్తున్న రెండు తాత్వికతలు ఏమిటి? వాటివల్ల జరుగుతున్న అనర్థం ఏమిటి? జీవ పరిణామ క్రమంలో శాస్త్రవేత్తలకు దొరకని లింకు ఒకటి ఉంది. అదేమిటో తెలుసా? తప్పుడు తాత్వికతలు ప్రపంచాన్ని ఏ స్థితికి తీసుకుని వచ్చాయి? డబ్బు తుచ్ఛమైందేనా? అసలైన స్వార్థం అంటే ఏమిటి? అయిన్ రాండ్ ప్రతిపాదించిన వస్తునిష్ఠావాదం (అబ్జెక్టివిజం) వీటన్నింటి గురించి ఏం చెబుతుంది ? ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ఫౌంటెన్హెడ్, అట్లాస్ ష్రగ్డ్ నవలలకి వెన్నెముకగా నిలిచి ఎందరినో ప్రభావితం చేసిన తన ఫిలాసఫీ అబ్జెక్టివిజమ్ గురించి వ్యాసాల్లోను, నవలల్లోను అయిన్ రాండ్ ఇచ్చిన అవగాహన ఇప్పుడు తెలుగులో...