దేశంలో ఎందరిలాగానో ముందు ఇంజనీరింగ్ చదివితే తప్ప వేరే ఏ రంగంలోకి వెళ్ళలేము అనే గుంపులో గోవింద మనస్తత్వం కాకుండా ఎందులో ఉన్నా సరే మనం ఉన్నత స్థాయికి వెళ్ళాలి అంటే ఎలా మొదలుపెట్టాలి అనే కూతుహలంతో రచయిత పదేళ్ళక్రితం ఎంతో సౌకర్యంగా ఉన్న ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం వదులుకుని ఈ వ్యాపారంలోనికి అడుగుపెట్టాడు. ఆలోచనలు ఉన్నంత సాఫీగా వ్యాపారరంగం సాగలేదు, అయినా కూడా వెనకడుగు వేసే ఆలోచనే లేకుండా ఒక్కో విషయం తెల్సుకుని అంచెలంచెలుగా వందల కోట్ల రూపాయల వ్యాపారం చేసే స్థాయికి ఎదిగాడు. అయితే తనలానే వచ్చే ఔత్సాహిక వ్యాపారవేత్తలకు కూడా ఒక దిశానిర్దేశం ఉంటే బాగుంటుంది అన్న ఉద్దేశ్యంతో స్టార్ట్అప్ మీద ట్రైన�... See more
దేశంలో ఎందరిలాగానో ముందు ఇంజనీరింగ్ చదివితే తప్ప వేరే ఏ రంగంలోకి వెళ్ళలేము అనే గుంపులో గోవింద మనస్తత్వం కాకుండా ఎందులో ఉన్నా సరే మనం ఉన్నత స్థాయికి వెళ్ళాలి అంటే ఎలా మొదలుపెట్టాలి అనే కూతుహలంతో రచయిత పదేళ్ళక్రితం ఎంతో సౌకర్యంగా ఉన్న ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం వదులుకుని ఈ వ్యాపారంలోనికి అడుగుపెట్టాడు. ఆలోచనలు ఉన్నంత సాఫీగా వ్యాపారరంగం సాగలేదు, అయినా కూడా వెనకడుగు వేసే ఆలోచనే లేకుండా ఒక్కో విషయం తెల్సుకుని అంచెలంచెలుగా వందల కోట్ల రూపాయల వ్యాపారం చేసే స్థాయికి ఎదిగాడు. అయితే తనలానే వచ్చే ఔత్సాహిక వ్యాపారవేత్తలకు కూడా ఒక దిశానిర్దేశం ఉంటే బాగుంటుంది అన్న ఉద్దేశ్యంతో స్టార్ట్అప్ మీద ట్రైనింగ్ మరియు కోరా డైజెస్ట్ లో 1500లకు పైగా సమాధానాలు ఇచ్చిన తరువాత రాసిన పుస్తకం ఇది. రచయిత పదేళ్ళ వ్యాపారఅనుభవం కొత్తవారికి సులభతరం చేయడంలో చాలా సఫలీకృతుడు అయ్యాడు అనడంలో సందేహమే లేదు. రచయిత సుధీర్ వర్మ ఇప్పటికీ 100కుపైగా విశ్వవిద్యాలయాల్లో విద్యార్ధులకు, ఉపాధ్యాయులకు కూడా స్టార్ట్అప్ మరియు బిజినెస్ అంశాల మీద ట్రైనింగ్ నిర్వహణ, రెండు వేల మందికి పైగా వ్యాపారస్థులకు పర్సనల్ బిజినెస్ కన్సల్టింగ్, 700లకు పైగా యూట్యూబ్, న్యూస్ చానెల్ మరియు న్యూస్ పేపర్ ఇంటర్వ్యూస్, ఎన్నో సంస్థలకు పర్సనల్ మెంటరింగ్ చేస్తూనే ప్రఖ్యాత బిజినెస్ స్కూల్ అయిన ఐఐఏం విశాఖపట్నం నుండి స్టార్ట్అప్స్ మీద మొదటిసారి పీజీ కోర్స్ చేస్తున్నారు. 40 వ్యాపారఅంశాలు, 108 వ్యాపార సలహాలు, ఎన్నోవ్యాపారాల కేస్ స్టడీస్ తో పాటు అసలు ఇంత సులభంగా వ్యాపారం చేయవచ్చా అనేలా విషయాన్ని సులభతరం చేయడం అతని ప్రత్యేకత. అందుకే కేవలం అతని రచనాశైలికి 80 లక్షల అభిమానులు ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు. ఇంకా ఎక్కువ ఆలోచన చేయకుండా కళ్ళు మూసుకుని పుస్తకం కొనేయండి - కళ్ళు తెరిచి చదివేయండి.