దిగవల్లి వేంకట శివరావు గారు వృత్తిరీత్యా న్యాయవాది. అది జీవనోపాధి వరకే! వారి ధ్యాస, వ్యాసంగం యావత్తు సాహిత్యం, పరిశోధన. ఒక నియమిత చట్రంలో, ఒకే ఒక విషయానికో, సాహిత్య విభాగానికో వారి రచనలు పరిమితం కాలేదు. అవి బహు ముఖమైనవి, వైవిద్యంతో కూడుకున్న వినూ! వాటిలో చారిత్రక, సామాజిక, రాజకీయ అంశాలతో పాటు సాంస్కృతిక విశేషాలు ఉంటాయి. అవి అపురూపమైనవి. ఇప్పటి తరానికి ఆసక్తి కలిగించేవి. పరిశోధకులకు ఉపకరించేవీనూ. వలసపాలనకు సంబంధించి ప్రధానంగా ఆర్ధిక, సామాజిక విషయాల గూర్చి శివరావు గారు శ్రమవోడ్చి, ఆర్కైవ్సులో గ్రంథాలయాల్లో దాగున్న ఆకరాలను సేకరించారు. పరిశోధకులకు అవి ఎంతగానో తోడ్పడుతున్నాయి.ఈ గ్రంథంలో ఎన్న�... See more
దిగవల్లి వేంకట శివరావు గారు వృత్తిరీత్యా న్యాయవాది. అది జీవనోపాధి వరకే! వారి ధ్యాస, వ్యాసంగం యావత్తు సాహిత్యం, పరిశోధన. ఒక నియమిత చట్రంలో, ఒకే ఒక విషయానికో, సాహిత్య విభాగానికో వారి రచనలు పరిమితం కాలేదు. అవి బహు ముఖమైనవి, వైవిద్యంతో కూడుకున్న వినూ! వాటిలో చారిత్రక, సామాజిక, రాజకీయ అంశాలతో పాటు సాంస్కృతిక విశేషాలు ఉంటాయి. అవి అపురూపమైనవి. ఇప్పటి తరానికి ఆసక్తి కలిగించేవి. పరిశోధకులకు ఉపకరించేవీనూ. వలసపాలనకు సంబంధించి ప్రధానంగా ఆర్ధిక, సామాజిక విషయాల గూర్చి శివరావు గారు శ్రమవోడ్చి, ఆర్కైవ్సులో గ్రంథాలయాల్లో దాగున్న ఆకరాలను సేకరించారు. పరిశోధకులకు అవి ఎంతగానో తోడ్పడుతున్నాయి.ఈ గ్రంథంలో ఎన్నో ముఖ్యమైన, అరుదైన విషయాలు చోటు చేసుకున్నాయి; సాహిత్యకారులు, స్నేహితులు వేలూరి శివరామశాస్త్రి,చిలకమర్తి లక్ష్మీనరసింహం, వడ్డాది సుబ్బారాయుడు గార్ల జీవిత విశేషాలుతో పాటు, ఆంధ్ర భాషాభివర్దని సమాజం గురించిన సమాచారం, ప్రముఖుల జీవిత విశేషాలతో పాటు శివరావు గారి నాన్నగారి గూర్చి. అడవి బాపిరాజు, డాక్టర్ జి ఎస్ శర్మ గార్ల గూర్చిన వివరాలు, మద్రాస్ రాజకీయాలు, కాశీనాధుని నాగేశ్వరరావు, అయ్యదేవర కాళేశ్వరరావు తదితరుల గూర్చిన ఆసక్తికర సాహిత్య, రాజకీయ అంశాలు చోటు చేసుకున్నాయి. శివరావు గారు జీవించి ఉండగా ప్రచురించిన సంపుటాలు కాకుండా తర్వాత వారి కుమారులు ప్రధానంగా ప్రస్తుత గ్రంథ సంపాదకులు విద్వత్ సంపన్నులు, దిగవల్లి రామచంద్ర గారు అహర్నిశలు శ్రమించి వారి తండ్రిగారు రాసి పెట్టుకున్న నోట్స్ శోధించి, క్రమ రీతిలో అమర్చి ప్రస్తుత గ్రంధాన్ని వెలువరిస్తున్నారు. వారి శ్రమకు పట్టుదలకు, తండ్రిగారి యడల ఉన్న గౌరవానికి ఇది నిదర్శనం.