జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించటానికి ఏం చేయాలనేది ఈ పుస్తకం ద్వారా తెలుసుకోవచ్చు. జీవితానికి, మరణానికి నడుమ ఓ లైబ్రరీ ఉంటుంది. ఆ లైబ్రరీలో వందలాది పుస్తకాలు అందుబాటులో ఉంటాయి. అవి మరో రకంగా జీవితాన్ని గడిపే అవకాశాన్ని అందిస్తాయి. అంతకు ముందు మాదిరిగా కాకుండా భిన్నమైనవి ఎంచుకోటానికి, వైవిధ్యంగా జీవించటానికి అవకాశాన్ని ఇస్తాయి. ఒకవేళ మీకే గనక పశ్చాత్తాపాలను పోగొట్టుకోవటానికి అవకాశం దొరికితే మీరేం చేస్తారో ఆలోచించండి. విశ్వానికి ఆవల, ఎక్కడో ఓ లైబ్రరీ ఉంటుంది. అందులో అనంతంగా పుస్తకాలు ఉంటాయి. ఒక్కో పుస్తకం వాస్తవానికి ప్రతీకలా ఉంటుంది. ఒక పుస్తకం మీ జీవితాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూపుతు�... See more
జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించటానికి ఏం చేయాలనేది ఈ పుస్తకం ద్వారా తెలుసుకోవచ్చు. జీవితానికి, మరణానికి నడుమ ఓ లైబ్రరీ ఉంటుంది. ఆ లైబ్రరీలో వందలాది పుస్తకాలు అందుబాటులో ఉంటాయి. అవి మరో రకంగా జీవితాన్ని గడిపే అవకాశాన్ని అందిస్తాయి. అంతకు ముందు మాదిరిగా కాకుండా భిన్నమైనవి ఎంచుకోటానికి, వైవిధ్యంగా జీవించటానికి అవకాశాన్ని ఇస్తాయి. ఒకవేళ మీకే గనక పశ్చాత్తాపాలను పోగొట్టుకోవటానికి అవకాశం దొరికితే మీరేం చేస్తారో ఆలోచించండి. విశ్వానికి ఆవల, ఎక్కడో ఓ లైబ్రరీ ఉంటుంది. అందులో అనంతంగా పుస్తకాలు ఉంటాయి. ఒక్కో పుస్తకం వాస్తవానికి ప్రతీకలా ఉంటుంది. ఒక పుస్తకం మీ జీవితాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూపుతుంది. మరో పుస్తకం ..జీవితంలో మరో అవకాశాన్ని అందిపుచ్చుకుంటే, ఇంకో రకమైన ఎంపిక చేసుకుని ఉంటే ఎలా ఉంటుందో మీకు పరిచయం చేస్తుంది. అదృష్టవశాత్తు మనకు ఛాన్స్ వచ్చి ఆ లైబ్రరీలోకి అడుగుపెట్టి మనకు మనం తరచి చూసుకుంటే, ఆయా జీవితాలు ప్రస్తుతం మనం గడుపుతున్న జీవితం కంటే మెరుగ్గా ఉంటాయా? నోరా సీడ్స్ ఇలాంటి నిర్ణయం తీసుకుంది. తన జీవితాన్ని మెరుగ్గా మార్చుకునే అవకాశం ఆమెకు లభించింది. కొత్త కెరీర్ ఎంచుకోవటానికి, బ్రేకప్స్ ను సరిచేసుకోవటానికి, గ్లేసియాలజిస్ట్ కావాలనే కోరికను నెరవేర్చుకోవటానికి ఆమె సిద్ధపడింది. మిడ్ నైట్ లైబ్రరీలో ప్రయాణిస్తూ తన అంతరంగంలోకి ఆమె తొంగిచూసుకోగలిగింది. జీవితాన్ని సఫలం చేసుకోవటానికి, దాన్ని విలువైనదిగా మలుచుకోవటానికి ఏం చేయాలనే అవగాహనను పెంచుకోగలిగింది. డిప్రెషన్ కు గురై ఆత్మహత్యకు సిద్ధపడిన ఈ 30 ఏళ్ల బ్రిటిష్ యువతి అనుభవాలు మనకు కొత్త చూపును ఇస్తాయి.