Kagitam Padavalu is a collection of Love Stories by V. Mallikarjun. "కొన్ని కొన్ని మనకు ఎంతలా అలవాటైపోతాయంటే, అవి లేకుంటే బతకలేం. అది వ్యసనమో ఇంకొకటో. అదైతే మనతో ఉండాలంతే. అలాంటిదొకటి ప్రేమ. నేను ప్రేమించకుండా ఉండలేను. ఆ ప్రేమలే ఈ ‘కాగితం పడవలు’. ఏమేమున్నాయి ఇందులో? నాకు నేను రాసుకున్న ఉత్తరాలు ఉన్నాయి. నాకు అప్పటికప్పుడు అనిపించినవి, నేను ప్రేమించిన వాళ్లకు చెప్పాలనిపించినవి (చెప్పినవీ!) రాసుకున్నాను. నేను చూసిన ప్రపంచాన్నీ పరిచయం చేయాలనుకున్నాను. వీటన్నింటికీ మించి నా ఆలోచనలను ఈ కాగితాల్లో ఎక్కించాను. అవి నాతోనే ఉంచుకోవడం నాకు ఇష్టం లేదు. ఎలాగోలా వాటిని వదిలెయ్యాలి. సారంగ పత్రిక నామీద వర్షంలా కురిసి, ఇక్కడో దారిని చూపించింది. బా�... See more
Kagitam Padavalu is a collection of Love Stories by V. Mallikarjun. "కొన్ని కొన్ని మనకు ఎంతలా అలవాటైపోతాయంటే, అవి లేకుంటే బతకలేం. అది వ్యసనమో ఇంకొకటో. అదైతే మనతో ఉండాలంతే. అలాంటిదొకటి ప్రేమ. నేను ప్రేమించకుండా ఉండలేను. ఆ ప్రేమలే ఈ ‘కాగితం పడవలు’. ఏమేమున్నాయి ఇందులో? నాకు నేను రాసుకున్న ఉత్తరాలు ఉన్నాయి. నాకు అప్పటికప్పుడు అనిపించినవి, నేను ప్రేమించిన వాళ్లకు చెప్పాలనిపించినవి (చెప్పినవీ!) రాసుకున్నాను. నేను చూసిన ప్రపంచాన్నీ పరిచయం చేయాలనుకున్నాను. వీటన్నింటికీ మించి నా ఆలోచనలను ఈ కాగితాల్లో ఎక్కించాను. అవి నాతోనే ఉంచుకోవడం నాకు ఇష్టం లేదు. ఎలాగోలా వాటిని వదిలెయ్యాలి. సారంగ పత్రిక నామీద వర్షంలా కురిసి, ఇక్కడో దారిని చూపించింది. బాల్యం గుర్తొచ్చింది. ఆ కాగితాలను పడవలు చేశా. ఇక్కడ వదిలేస్తున్నా. మీరు ఇదే దార్లో ఉంటే నేనే పంపించానని తెల్సుకొని, తీసుకొని అందుకోండి. చదివాక మళ్లీ వదిలెయ్యడం మర్చిపోవద్దు!" - వి. మల్లికార్జున్