భవిష్యవాణి వల్ల దేవుడిగా మారిన మనిషి కథ
క్రీ.పూ 1900. ఆధునిక భారతీయులు పొరపాటుగా సింధునాగరికతగా పిలుస్తున్న సమాజంలో... దాదాపుగా పరిపూర్ణతను సాధించిన సామ్రాజ్యం. దాన్ని ఈ భూమిని ఏలిన చక్రవర్తులందరిలో గొప్పవాడిగా గుర్తింపు పొందిన శ్రీరాముడు సృష్టించాడు. ఆ కాలపు పౌరులు దాన్ని మొలూహా భూమిగా పిలుచుకునేవారు.
ఆ భూమిలోని ప్రధాన నది అయిన సరస్వతీ ప్రవాహం క్షీణిస్తూ అంతరించిపోయే ప్రమాదంలో పడటం వల్ల శతాబ్దాల పాటు సగర్వంగా నిలిచిన ఆ సామ్రాజ్యమూ, దాని సూర్యవంశ చక్రవర్తులూ అనేక సమస్యలను ఎదుర్కుంటున్నారు. తూర్పున ఉన్న చంద్రవంశీయ భూముల నుంచి భయంకరమైన తీవ్రవాద దాడులను కూడా ఎదుర్కుంటున్నారు. తాజాగా ఆ చ... See more
భవిష్యవాణి వల్ల దేవుడిగా మారిన మనిషి కథ
క్రీ.పూ 1900. ఆధునిక భారతీయులు పొరపాటుగా సింధునాగరికతగా పిలుస్తున్న సమాజంలో... దాదాపుగా పరిపూర్ణతను సాధించిన సామ్రాజ్యం. దాన్ని ఈ భూమిని ఏలిన చక్రవర్తులందరిలో గొప్పవాడిగా గుర్తింపు పొందిన శ్రీరాముడు సృష్టించాడు. ఆ కాలపు పౌరులు దాన్ని మొలూహా భూమిగా పిలుచుకునేవారు.
ఆ భూమిలోని ప్రధాన నది అయిన సరస్వతీ ప్రవాహం క్షీణిస్తూ అంతరించిపోయే ప్రమాదంలో పడటం వల్ల శతాబ్దాల పాటు సగర్వంగా నిలిచిన ఆ సామ్రాజ్యమూ, దాని సూర్యవంశ చక్రవర్తులూ అనేక సమస్యలను ఎదుర్కుంటున్నారు. తూర్పున ఉన్న చంద్రవంశీయ భూముల నుంచి భయంకరమైన తీవ్రవాద దాడులను కూడా ఎదుర్కుంటున్నారు. తాజాగా ఆ చంద్రవంశీయులు శాపగ్రస్తులూ, వికార శరీరులూ, వీరవిద్యలలో అసమాన నైపుణ్యం కలవారూ, సప్తసింధుభూముల నుంచి వెలివేయబడిన పాపాత్ములూ అయిన నాగాలతో మైత్రి కుదుర్చుకున్నట్లు కనబడటంతో పరిస్థితులు మరింత దిగజారాయి.
ప్రస్తుతం సూర్యవంశీయుల ఆశలన్నీ ఆ భూమి గురించి చెప్పబడిన భవిష్యవాణి మీదే ఉన్నాయి. దాని ప్రకారం ‘దుష్టత్వానికి హద్దుల్లేవేమో అనిపించేంతగా ఎదిగినప్పుడు, సర్వం నాశనం అయిపోతోంది అనిపించినపుడు, శత్రువుల విజయం తథ్యం అనిపిస్తున్నప్పుడు ఒక రక్షకుడు ఆవిర్భవిస్తాడు’
ఆ రక్షకుడు టిబెట్ పర్వతప్రాంతాల నుంచి వలస వచ్చిన మొరటు గిరిజనుడైన శివుడే కాగలడా?
అసలతడు రక్షకుడు కావాలనుకుంటున్నాడా?
తన ప్రేమ కోసం, కర్తవ్యం కోసం అకస్మాత్తుగా ఈ ధ్యేయాన్ని భుజానికెత్తుకున్న శివుడు సూర్యవంశీయుల ప్రతీకారానికి నాయకత్వం వహించి, దుష్టత్వాన్ని నాశనం చేయగలుగుతాడా?
తన ప్రారబ్దం వల్ల, కర్మల వల్ల దేవాధిదేవుడైన మహాదేవుడిగా ఎదిగిన సాధారణ మానవుడశివుడు. అతని చరిత్ర తెలుపుతూ రాస్తున్న శివ త్రయం(మూడు పుస్తకాల సంపుటి) లో ఇది మొదటి పుస్తకం.