చీకటి లేకుంటే వెలుతురు ప్రయోజనం లేదు.
రాక్షసులు లేకుంటే, దేవతలేం చేస్తారు?
భారతదేశం, క్రీ.పూ. 3400
విద్రోహం, పేదరికం, సంక్షోభంలో ఉన్న దేశం. ఎక్కువమంది ప్రజలు కిమ్మనకుండా భరిస్తారు. కొందరు ఎదురు తిరుగుతారు. కొందరు మెరుగైన ప్రపంచం కోసం పోరాడతారు. కొందరు స్వార్థం కోసం పోరాడతారు. కొందరికి ఇవేవీ పట్టవు.
మహాజ్ఞానిగా గుర్తింపు పొందిన ఋషి తనయుడు - రావణుడు. అందరినీ మించిన ప్రతిభావంతుడిగా దేవతలు అతన్ని ఆశీర్వదించారు. విధి నిర్దేశించిన కఠిన పరీక్షలనెదుర్కొనే శాపగ్రస్తుడు. ఎదురులేని యువ సముద్రపు దొంగ. సాహసం, క్రూరత్వం, దృఢసంకల్పం కలవాడు. మనుషులలో మహోన్నతుడు కావాలని, జయించాలని, దోచుకోవాలని, తన హక్కు అని ... See more
చీకటి లేకుంటే వెలుతురు ప్రయోజనం లేదు.
రాక్షసులు లేకుంటే, దేవతలేం చేస్తారు?
భారతదేశం, క్రీ.పూ. 3400
విద్రోహం, పేదరికం, సంక్షోభంలో ఉన్న దేశం. ఎక్కువమంది ప్రజలు కిమ్మనకుండా భరిస్తారు. కొందరు ఎదురు తిరుగుతారు. కొందరు మెరుగైన ప్రపంచం కోసం పోరాడతారు. కొందరు స్వార్థం కోసం పోరాడతారు. కొందరికి ఇవేవీ పట్టవు.
మహాజ్ఞానిగా గుర్తింపు పొందిన ఋషి తనయుడు - రావణుడు. అందరినీ మించిన ప్రతిభావంతుడిగా దేవతలు అతన్ని ఆశీర్వదించారు. విధి నిర్దేశించిన కఠిన పరీక్షలనెదుర్కొనే శాపగ్రస్తుడు. ఎదురులేని యువ సముద్రపు దొంగ. సాహసం, క్రూరత్వం, దృఢసంకల్పం కలవాడు. మనుషులలో మహోన్నతుడు కావాలని, జయించాలని, దోచుకోవాలని, తన హక్కు అని భావించే గొప్పతనాన్ని సొంతం చేసుకోవాలనుకునేవాడు.
వైరుధ్యాల నిలయం - క్రూరమైన హింసాత్మకత, అసాధారణ పాండిత్య ప్రకర్ష. ఫలితం కోరకుండా ప్రేమించే వ్యక్తి, పశ్చాత్తాపం లేకుండా చంపే వ్యక్తి.
రామచంద్ర గ్రంథమాలలో ఆసక్తి గొలిపే మూడో పుస్తకం లంకాధిపతి రావణుడి జీవితంపై వెలుగు ప్రసరింపజేస్తుంది. ఈ వెలుగు అంధకారాల్లో కెల్ల అంధకారంపై పడి మెరుస్తుంది. నిజంగా ఈ వ్యక్తి చరిత్రలోనే పెద్ద ప్రతినాయకుడా? లేక అనుక్షణం అంధకారం చుట్టుముట్టిన వ్యక్తా?
కాలచక్రంలో అందరికన్న కఠినుడు, అందరికన్న నిర్ణయుడు, అందరికన్న ఎక్కువ ప్రేమించేవాడు, అందరికన్న ప్రతిభావంతుడు అయిన వ్యక్తి జీవిత కథను చదవండి.