ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన నగరం కాశీ. ఆధ్యాత్మిక నగరమైన ‘కాశీ’ వారణాసిగా కూడా పిలవబడుతుంది. పాంచజన్య పుట్టి, పెరిగి, జ్ఞానాన్ని సంపాదించుకున్న నగరం ఇదే. తల్లితండ్రులు చనిపోయినప్పుడు పాంచజన్యకి తనకంటూ ఒక లక్ష్యం లేదు. వాళ్ళ ఎడబాటు నుంచి తట్టుకుని నిలబడడానికి అతని తల్లితండ్రుల లక్ష్యాన్ని తన లక్ష్యంగా చేసుకున్నాడు. దాన్ని చేరుకోవడం కోసం అతడు చేసే యత్నాలు విశేషమైనవి. మనస్సులోని దృఢనిశ్చయం మరియు అవగాహన తన లక్ష్యాన్ని అడ్డుకునే ప్రతి అడ్డంకిని తొలగించుకుంటూ అతన్ని ముందుకు తీసుకువెళ్తుంది. ప్రతి సమరం అతని జీవితంలో ఒక విజయమే. తన బలహీనతనే బలంగా మార్చుకున్న యోధుడు పాంచజన్య. తన గురువుల మార్�... See more
ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన నగరం కాశీ. ఆధ్యాత్మిక నగరమైన ‘కాశీ’ వారణాసిగా కూడా పిలవబడుతుంది. పాంచజన్య పుట్టి, పెరిగి, జ్ఞానాన్ని సంపాదించుకున్న నగరం ఇదే. తల్లితండ్రులు చనిపోయినప్పుడు పాంచజన్యకి తనకంటూ ఒక లక్ష్యం లేదు. వాళ్ళ ఎడబాటు నుంచి తట్టుకుని నిలబడడానికి అతని తల్లితండ్రుల లక్ష్యాన్ని తన లక్ష్యంగా చేసుకున్నాడు. దాన్ని చేరుకోవడం కోసం అతడు చేసే యత్నాలు విశేషమైనవి. మనస్సులోని దృఢనిశ్చయం మరియు అవగాహన తన లక్ష్యాన్ని అడ్డుకునే ప్రతి అడ్డంకిని తొలగించుకుంటూ అతన్ని ముందుకు తీసుకువెళ్తుంది. ప్రతి సమరం అతని జీవితంలో ఒక విజయమే. తన బలహీనతనే బలంగా మార్చుకున్న యోధుడు పాంచజన్య. తన గురువుల మార్గదర్శకత్వంలో ఆత్మీయుల సహాయంతో లక్ష్య సాధన కోసం తన సాహస యాత్రని కాశీ నగరం నుంచి ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు పాంచజన్య. తన లక్ష్య సాధనలో ఎదురైన అవాంతరాలను ఎలా అధిగమించాడు..? మరియు పరిచయమైన బంధాలతో పయనం ఎలా సాగింది..? అనేది తెలియాలి అంటే పాంచజన్య చదవాల్సిందే...