ఆర్థికంగా ఎదగాలని అందరూ స్వప్నిస్తారు. అయితే, భవిష్యత్తును అంచనా వేయగలిగితే.. ఆ కలలను సాకారం చేసుకోవడం అసాధ్యమేమీ కాదంటారు 'పైసల ముచ్చట్లు' రచయిత ఎం. రాంప్రసాద్. దాదాపు నాలుగువేల కుటుంబాలకు ఆర్థిక పాఠాలను బోధించి, పెట్టుబడుల దారిలో సరైన దిశానిర్దేశం చేశారు. ఆయన. ఈ క్రమంలో ఆయన్ను కలిసిన ప్రతి ఒక్కరూ ఏదో సమస్యతో సతమతమైన వ్యక్తే! ఒకరు రుణబాధలతో కుదేలైతే, మరొకరు ఆస్తులున్నా ఎలా అనుభవించాలో తెలియని స్థితిలో ఉన్నవారు! అవగాహనలేమితో ఆస్తులు కరిగించుకున్నవాళ్లు మరో రకం! వీళ్లంతా రాంప్రసాద్ క్లయింట్ గా మారాక, ఓ ఒడ్డుకు చేరారు. సంతోషంగా జీవనం సాగిస్తున్నారు. 'మొదటి రూపాయి సంపాదించడం వరకే కష్టపడాలి.... See more
ఆర్థికంగా ఎదగాలని అందరూ స్వప్నిస్తారు. అయితే, భవిష్యత్తును అంచనా వేయగలిగితే.. ఆ కలలను సాకారం చేసుకోవడం అసాధ్యమేమీ కాదంటారు 'పైసల ముచ్చట్లు' రచయిత ఎం. రాంప్రసాద్. దాదాపు నాలుగువేల కుటుంబాలకు ఆర్థిక పాఠాలను బోధించి, పెట్టుబడుల దారిలో సరైన దిశానిర్దేశం చేశారు. ఆయన. ఈ క్రమంలో ఆయన్ను కలిసిన ప్రతి ఒక్కరూ ఏదో సమస్యతో సతమతమైన వ్యక్తే! ఒకరు రుణబాధలతో కుదేలైతే, మరొకరు ఆస్తులున్నా ఎలా అనుభవించాలో తెలియని స్థితిలో ఉన్నవారు! అవగాహనలేమితో ఆస్తులు కరిగించుకున్నవాళ్లు మరో రకం! వీళ్లంతా రాంప్రసాద్ క్లయింట్ గా మారాక, ఓ ఒడ్డుకు చేరారు. సంతోషంగా జీవనం సాగిస్తున్నారు. 'మొదటి రూపాయి సంపాదించడం వరకే కష్టపడాలి. తర్వాత ఆ రూపాయే.. మనకు కావాల్సిన డబ్బు సంపాదించాలి' అన్నది రాం ప్రసాద్ థియరీ! తను నమ్మిన సిద్ధాంతమే పెట్టుబడిగా 'సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్'గా సేవలు అందిస్తున్నారు ఆయన. చాలామంది ఆర్థిక నిపుణులు పొదుపు చేయాలనీ, మదుపు అత్యవసరమనీ ఇలా బోధిస్తుంటారు. రాం ప్రసాద్ ది ప్రత్యేకమైన తరహా! ఎవరి భవిష్యత్ అవసరాలకు తగ్గట్టు వాళ్ల ఆర్థిక ప్రణాళిక ఉండాలని చెబుతుంటారు. ఈ క్రమంలో ఆ వ్యక్తికి వచ్చే సంపాదన, ఖర్చులు, కోరికలు, లక్ష్యాలు వీటన్నిటినీ బేరీజు వేసుకొని ప్రతి కుటుంబానికి పర్ఫక్ట్ ప్రణాళిక నిర్దేశిస్తారు. ప్రత్యక్షంగా వేల కుటుంబాలకు అసలైన ఆర్థిక విజయం చేకూర్చారు. యూట్యూబ్ వేదికగా, నమస్తే తెలంగాణ పత్రికలో 'పైసల ముచ్చట్లు' కాలమ్ ద్వారా లక్షల మందికి డబ్బు విలువ తెలియ జేశారు. ఈ పుస్తకం చదివితే. మీకొచ్చే ఆదాయంలోనే సిరిసం పదలు ఎలా సృష్టించుకోవచ్చో స్పష్టమైన అవగాహన వస్తుంది.