కాశ్మీర్ సమస్య గురించి అరవైయేళ్ళకు పైగా మాట్లాడుతున్నాము. ఛిత్రమేమిటంటే అసలు కాశ్మీర్ సమస్య ఏమిటో, దాన్ని ఎలా పరిష్కరించ గూరుతున్నామో మనను నడిపించిన నాయకులకే ఈనాటికీ సరిగ్గా తెలియదు. ఇండియన్ యూనియన్ లొ కాశ్మీర్ విలీనం యే పరిస్థితులలో జరిగింది ,అప్పటి నుంచి మన నాయకాగ్రేసరులు ఆడిన నాటకాలు,కపట రాజకీయాలు,పాములను పాలుపోసి పెంచిన వైనాలను కళ్ళకు కట్టించే ఈ గ్రంథం కాశ్మీర్ పై ఎం.వి.ఆర్.శాస్త్రిగారు రాసిన రెండు పుస్తకాలలో మొదటిది. కాశ్మీర్ సమస్యకు మూలకారకులు ఏమిటి, పరిస్తితి ఇలా ఎందుకు విషమించింది అని తెలుసుకోగొరెవారు తప్పక చదవాల్సిన గ్రంధం- కాశ్మీర్ కథ