2019 ఆగస్టు 5. జమ్మూ కాశ్మీర్ని నలిపి నశింపచేసే కబంధ హస్తం, అన్యాయాల అనకొండ అయిన ఆర్టికల్ 370 తొలిగిపోయిన రోజు. ఆ రోజు కాశ్మీరంపై కరకు చీకటి చెర తొలగిన రోజు. సమగ్ర, స్వాభిమాన, సార్వభౌమ భారత సూర్యుడు వెలిగిన రోజు. ఆ సూర్యుడు వెలగడానికి ముందు, వేర్పాటువాద విషాంధకారంపై ఎందరెందరో మిణుగురులై తమను తాము దహించుకుంటూనే పోరాడారు. ఇంకెందరో ఆకాశంలో తారకలై వెలుగులీనారు. మరికొందరు కొవ్వొత్తులయి కరుగుతూ కరుగుతూ కాంతులిచ్చారు. అలాంటి ఆగణిత వీరవరుల్లో ఓ గుప్పెడుమంది కథ ఇది. 5 ఆగస్టు 2019 తేదీన భారత పార్లమెంటు ఆర్టికల్ 370 ని జమ్మూ కాశ్మీరంలో నిర్వీర్యం చేయకముందు కాలంలో అసంఖ్యాకంగా భారతీయులు తమ ప్రాణత్యాగంతో, ఉగ్రవ... See more
2019 ఆగస్టు 5. జమ్మూ కాశ్మీర్ని నలిపి నశింపచేసే కబంధ హస్తం, అన్యాయాల అనకొండ అయిన ఆర్టికల్ 370 తొలిగిపోయిన రోజు. ఆ రోజు కాశ్మీరంపై కరకు చీకటి చెర తొలగిన రోజు. సమగ్ర, స్వాభిమాన, సార్వభౌమ భారత సూర్యుడు వెలిగిన రోజు. ఆ సూర్యుడు వెలగడానికి ముందు, వేర్పాటువాద విషాంధకారంపై ఎందరెందరో మిణుగురులై తమను తాము దహించుకుంటూనే పోరాడారు. ఇంకెందరో ఆకాశంలో తారకలై వెలుగులీనారు. మరికొందరు కొవ్వొత్తులయి కరుగుతూ కరుగుతూ కాంతులిచ్చారు. అలాంటి ఆగణిత వీరవరుల్లో ఓ గుప్పెడుమంది కథ ఇది. 5 ఆగస్టు 2019 తేదీన భారత పార్లమెంటు ఆర్టికల్ 370 ని జమ్మూ కాశ్మీరంలో నిర్వీర్యం చేయకముందు కాలంలో అసంఖ్యాకంగా భారతీయులు తమ ప్రాణత్యాగంతో, ఉగ్రవాదులతో పోరాడి కాశ్మీరాన్ని కాపాడారు. అటువంటి వీరుల బలిదానాన్ని మనకు పరిచయం చేస్తూ సాగిన శ్రీ రాకా సుధాకర్ రావు గారి అద్భుత రచన ‘అజ్ఞాత కాశ్మీర్ ఫైల్స్’.