శ్రీ వాల్మీకి రామాయణం - శ్రీనివాస శిరోమణి రామాయణము భారతీయ వాఙ్మయములో ఆదికావ్యముగా సుప్రసిధ్ధము, దానిని సంస్కృతము లో రచించిన వాల్మీకి మహాముని ఆదికవిగా మరింత సుప్రసిధ్ధము. రామాయణం కావ్యంలోని కథ త్రేతా యుగంలో జరిగినట్లు వాల్మీకి పేర్కొన్నారు. ప్రపంచం లోని అన్ని భాషలలో ఈ కావ్యము ఎంతో ఆదర ణీయము, పూజనీయము. రామాయణము గ్రంధంలో శ్రీ సీతారాముల పవిత్ర చరిత్ర వర్ణింపబడింది. తండ్రీకొడుకులు, భార్యాభర్తలు, అన్నదమ్ములు, యజమాని-సేవకులు, మిత్రులు, రాజు-ప్రజలు, భగవంతుడు-భక్తుడు - వీరందరి మధ్య గల సంబంధబాంధవ్యములు, ప్రవర్తనా విధానములు రామాయణములో చెప్పబడినవి. చాలా మంది అభిప్రాయములో రామాయణములోని పాత్రలు ఆదర... See more
శ్రీ వాల్మీకి రామాయణం - శ్రీనివాస శిరోమణి రామాయణము భారతీయ వాఙ్మయములో ఆదికావ్యముగా సుప్రసిధ్ధము, దానిని సంస్కృతము లో రచించిన వాల్మీకి మహాముని ఆదికవిగా మరింత సుప్రసిధ్ధము. రామాయణం కావ్యంలోని కథ త్రేతా యుగంలో జరిగినట్లు వాల్మీకి పేర్కొన్నారు. ప్రపంచం లోని అన్ని భాషలలో ఈ కావ్యము ఎంతో ఆదర ణీయము, పూజనీయము. రామాయణము గ్రంధంలో శ్రీ సీతారాముల పవిత్ర చరిత్ర వర్ణింపబడింది. తండ్రీకొడుకులు, భార్యాభర్తలు, అన్నదమ్ములు, యజమాని-సేవకులు, మిత్రులు, రాజు-ప్రజలు, భగవంతుడు-భక్తుడు - వీరందరి మధ్య గల సంబంధబాంధవ్యములు, ప్రవర్తనా విధానములు రామాయణములో చెప్పబడినవి. చాలా మంది అభిప్రాయములో రామాయణములోని పాత్రలు ఆదర్శ జీవనమునకు ప్రమాణముగా స్వీకరింపవచ్చు. ఈ గ్రంధాన్ని రసరమ్యంగా అందరికీ అర్ధమయ్యేలా వచనానువాదాన్ని మనకి అందించారు శ్రీనివా శిరోమణి గారు, అంతె భావుకతతో బాల, అయోధ్య కాండాలు ఒక పుస్తకంగాను, అరణ్య, కిష్కింధ, సుందర కాండాలు మరో పుస్తకంగా, యుద్ధ, ఉత్తర కాండాలు ఇంకొక పుస్తకంగా ప్రచురించి ఒక అట్టపెట్టెలో అందంగా పాఠకులకు అందిస్తున్నారు నవరత్న బుక్ హౌస్ వారు . మన భారతీయ ఇతిహాసమైన రామాయణము ఉన్న ఇల్లు సర్వ భోగాల నిలయమని వేరే చెప్పక్కర్లేదుగా మీకు! అంతే కాదు నేటి యువతకు ఈ రామాయణo పర్సనాలిటీ దేవోలెప్మెంట్ గైడ్ గా కూడా ఉపయోగపడుతుంది .