రిచర్డ్ కోచ్, మాజీ మేనేజిమెంట్ కన్సల్టెంట్. 1990లో ఉద్యోగాన్ని వదిలేసి పూర్తిగా రచయితగా మారారు. మొత్తం 18 పుస్తకాలు రాశారు. ‘ది పవర్ లాస్’, ‘లివింగ్ ది 80/20 వే’ ‘సూపర్ కనెక్ట్’ పుస్తకాల ద్వారా బాగా ప్రాచుర్యం పొందారు. ఆయన తాను ప్రవచించే 80/20 సిద్ధాంతాన్ని తన వ్యక్తిగత జీవితానికి అన్వయించుకున్నారు. ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఎంఏ, వార్డన్ స్కూలు నుంచి ఎంబీఏ చేసిన కోచ్ తర్వాత రోజుల్లో బెయిన్ అండ్ కంపెనీలో భాగస్వామిగా మారాడు. 1983లో ఎల్ ఈ కె కన్సల్టెన్సీని ప్రారంభించాడు. కోచ్ వ్యాపార సామ్రాజ్యంలో ఫిలోపాక్స్, ప్లైమౌత్ జిన్, బెల్గో రెస్టారెంట్స్, బెట్ఫయిర్, ఫాన్ డ్యుయెల్, ఆటో వంటి కంపెనీలున్నాయి. 80/20 పుస... See more
రిచర్డ్ కోచ్, మాజీ మేనేజిమెంట్ కన్సల్టెంట్. 1990లో ఉద్యోగాన్ని వదిలేసి పూర్తిగా రచయితగా మారారు. మొత్తం 18 పుస్తకాలు రాశారు. ‘ది పవర్ లాస్’, ‘లివింగ్ ది 80/20 వే’ ‘సూపర్ కనెక్ట్’ పుస్తకాల ద్వారా బాగా ప్రాచుర్యం పొందారు. ఆయన తాను ప్రవచించే 80/20 సిద్ధాంతాన్ని తన వ్యక్తిగత జీవితానికి అన్వయించుకున్నారు. ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఎంఏ, వార్డన్ స్కూలు నుంచి ఎంబీఏ చేసిన కోచ్ తర్వాత రోజుల్లో బెయిన్ అండ్ కంపెనీలో భాగస్వామిగా మారాడు. 1983లో ఎల్ ఈ కె కన్సల్టెన్సీని ప్రారంభించాడు. కోచ్ వ్యాపార సామ్రాజ్యంలో ఫిలోపాక్స్, ప్లైమౌత్ జిన్, బెల్గో రెస్టారెంట్స్, బెట్ఫయిర్, ఫాన్ డ్యుయెల్, ఆటో వంటి కంపెనీలున్నాయి. 80/20 పుస్తకం ద్వారా ఆయన ఖ్యాతి గడించారు.