దీన్ని రాయడానికి ప్రవీణ్ ఎంచుకున్న రచనా పద్ధతి విశిష్టంగా కనిపిస్తుంది. తెలుగు సాహిత్యంలోని ఒక కవితనో, ఒక కథనో, ఒక పద్యాన్నో, ఒక సన్నివేశాన్నో వివరిస్తాడు. దాన్ని రామ్ గోపాల్ వర్మ జీవితానికి, అతని జీవితంతో ముడిపడిన జీవితాలకు అన్వయించే ప్రయత్నం చేస్తాడు. అంతలోనే ఏ ఇంగ్లీష్ కవి చెప్పిన వాక్యంగాని, ఒక ఫిలాసఫర్ గాని చెప్పిన అభిప్రాయంతో గానీ దాన్ని ముడి పెడతాడు. అదీ సరిపోదనుకుంటే ఏవో కొన్ని నవలల్ని చెప్పి, వాటిలోని సన్నివేశాలతో కూడా కలిపి విశ్లేషిస్తుంటాడు. దీని ద్వారా ప్రవీణ్ అధ్యయన విస్తృతి తెలుస్తూనే, రామ్ గోపాల్ వర్మ అప్పటికైనా తనకు దొరుకుతాడో లేదోననే అన్వేషణతో మరికొన్ని మార్గాల్ని కూ... See more
దీన్ని రాయడానికి ప్రవీణ్ ఎంచుకున్న రచనా పద్ధతి విశిష్టంగా కనిపిస్తుంది. తెలుగు సాహిత్యంలోని ఒక కవితనో, ఒక కథనో, ఒక పద్యాన్నో, ఒక సన్నివేశాన్నో వివరిస్తాడు. దాన్ని రామ్ గోపాల్ వర్మ జీవితానికి, అతని జీవితంతో ముడిపడిన జీవితాలకు అన్వయించే ప్రయత్నం చేస్తాడు. అంతలోనే ఏ ఇంగ్లీష్ కవి చెప్పిన వాక్యంగాని, ఒక ఫిలాసఫర్ గాని చెప్పిన అభిప్రాయంతో గానీ దాన్ని ముడి పెడతాడు. అదీ సరిపోదనుకుంటే ఏవో కొన్ని నవలల్ని చెప్పి, వాటిలోని సన్నివేశాలతో కూడా కలిపి విశ్లేషిస్తుంటాడు. దీని ద్వారా ప్రవీణ్ అధ్యయన విస్తృతి తెలుస్తూనే, రామ్ గోపాల్ వర్మ అప్పటికైనా తనకు దొరుకుతాడో లేదోననే అన్వేషణతో మరికొన్ని మార్గాల్ని కూడా వెతుకుతూ ముందుకి వెళ్తుంటాడు. - ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు ఆర్జీవి ఒక బుద్ధిహీనుడైన మేధావి' అని ప్రవీణ్ ఒక పుస్తకం రాశాడు...చాలా ' విషయాల్ని ఎంతో విపులంగా చర్చించాడు... RGV కొత్తసీసాలో ఉన్న పాత బాగుంది.మందులాంటి వాడు... చప్పరించే కొద్దీ బావుంటుంది.... ఒకదశలో అలవాటైపోతుంది.. కొన్నాళ్ళకి మనం మెల్లి మెల్లిగా RGVలైపోతాం అదే వర్మ మ్యాజిక్..! -తనికెళ్ళ భరణి Evolution లో కోతులన్నీ మనుషులైపోయాయి. కానీ ఒక్కటి మాత్రం తిరిగి కోతిగా మారిపోయింది. ఆ కోతి పేరు ఆర్జీవి. అది తెలివైన కోతి. దానికన్నీ తెలుసు. బాగా చదువుకుంది. దానికి లాజిక్ తెలుసు, మనుషుల ఎమోషన్స్ తెలుసు, సైకాలజీ తెలుసు, అడ్డమైన విషయాలన్నీ తెలుసు. అందుకే అది మనుషులతో ఆడుకోవడం మొదలెట్టింది. -పూరి జగన్నాథ్